డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించండి

On
డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించండి

మనస్సాక్షి, అనంతపురం : జిల్లాలోని అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ సెంటర్ల మీద మెగా డ్రైవ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌లు నిర్వహించాలని ఆర్డీఓ మధుసూదన్‌ సూచించారు. గర్భస్థ పిండ లింగ

మనస్సాక్షి, అనంతపురం : జిల్లాలోని అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ సెంటర్ల మీద మెగా డ్రైవ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌లు నిర్వహించాలని ఆర్డీఓ మధుసూదన్‌ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మధుసూదన్‌ మాట్లాడుతూ మెగా డ్రైవ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌లు ప్రతినెల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామస్థాయి మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆడపిల్లల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. నోడల్‌ అధికారి డా. యుగంధర్‌ మాట్లాడుతూ అనంతపురం డివిజన్లో 110 స్కాన్‌ సెంటర్లు ఉన్నాయని, వీటిని తరచుగా తనిఖీలు నిర్వహించి అబార్షన్లు నిర్వహిస్తున్న సెంటర్ల మీద చర్యలు చేపడతామన్నారు. గ్రామస్థాయిలో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి గ్రామ,మండల పరిధిలోని గ్రామ వాలంటీరు, సచివాలయ మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల తో ఒక టీం ఏర్పాటు చేసి అక్కడ తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆడపిల్ల ల ప్రాముఖ్యత ను ప్రజలకు వివరిస్తామన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాలల్లో వ్యాస రచన పోటీ లు నిర్వహించి అవగాహన పెంపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డా.మనోరంజన్‌ రెడ్డి డా. ప్రవీణ్‌ దిన్‌ కుమార్‌ డా. ఉమాదేవి డా.ముబిన్‌ తాజ్‌ టూ టౌన్‌ ఎస్‌ఐ శివరాముడు, ఆర్డిటి డైరెక్టర్‌ సిరెప్ప, రెడ్స్‌ భానుజా ,డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు

Manassakshi Epaper
Views:16

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు