తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీకి నీరు విడుదల
On
మనస్సాక్షి, కణేకల్లు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అనంతపురం, కడప జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ సోమవారం అధికారులు నీటిని విడుదల చేశారు. ముందుగా గేట్లకు డ్యాం కార్యదర్శి ఓ ఆర్ కే రెడ్డి, ఎస్ఈ శ్రీకాంత్ రెడ్డి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. అనంతరం బటన్ నొక్కి హెచ్ఎల్సీకి నీటిని విడుదల చేశారు. జలాశయం నుంచి గంటకు 100 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్లు జలాశయ ఏస్ఈ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గంట గంటకు 100 క్యూసెక్కులు పెంచుతూ 500 దామాషా ప్రకారం 2వేల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హెచ్ఎల్సీకి నీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
About The Author
Related Posts
Latest News
06 Mar 2025 16:34:57
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్...