వైసీపీ నుంచి కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి సస్పెండ్‌

On
వైసీపీ నుంచి కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి సస్పెండ్‌

మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్దారెడ్డి సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్‌ సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా పని చేసినట్లు అధిష్టానం గుర్తించింది. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని వైసీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పనిచేసినట్లు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే తాజాగా డాక్టర్‌ సిద్దారెడ్డిపై వేటు పడగా.. త్వరలోనే మరికొంత మందిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో పూర్తి ప్రక్షాళన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 
 

Manassakshi Epaper
Views:991

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?