సీనియర్ జర్నలిస్ట్ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
మనస్సాక్షి, పుట్టపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ ప్రతిమ ధర్మరాజ్‌ను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సన్మానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో మహళా సాధికారత`సవాళ్లు`పరిష్కారాలు అనే అంశంపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై సమాజ శ్రేయస్సు కోసం ఉత్తమ సేవలను అందించిన వారిని శాలువాతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. స్మార్ట్ హెల్మెట్ తయారు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విజయభార్గవి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మహిళా జర్నలిస్ట్ ప్రతిమ ధర్మరాజ్, రజని, ప్రియాంక, సిరిని సన్మానించారు. అంతకుముందు మహిళా దినోత్సవ ఆవశ్యకతను ఎస్పీ రత్న వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకుని చట్టాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, డీఎస్పీలు ఆదినారాయణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.