గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!

On
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!

మనస్సాక్షి, కణేకల్లు: మండలంలోని ఎర్రగుంట శివారులో హెచ్ఎల్సీలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంటకు చెందిన  కురుబ కిషోర్ కుమార్(43) గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో   గ్రామ శివారులోని హెచ్ఎల్సీ 5 వ డిస్ట్రిబ్యూటరీ కాలవ వద్ద ఉన్న హెచ్ఎల్సీ గట్టు పై మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్, పర్సు వదిలి అదృశ్యం అయ్యాడు. హెచ్ఎల్సీలో గల్లంతయ్యాడని భావించి కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. నాలుగు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో కురుబ కిషోర్ కుమార్ మృతదేహం లభ్యమైందని ఎస్సై నాగమధు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య అరుణతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Manassakshi Epaper
Views:170

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు