ఫలించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృషి

On
ఫలించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృషి

మనస్సాక్షి, కణేకల్లు : రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృషి ఎట్టకేలకు ఫలించింది. కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువు అవుట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ మరమ్మతు పనులు, కణేకల్లు - గంగులాపురం వంతెన నిర్మాణం అనతికాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో  స్థానిక టీడీపీ నాయకులు సొంత నిధులతో చెరువు అవుట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ మరమ్మతు పనులు, వంతెన నిర్మాణ పనులు ఆదివారం కాంక్రీట్‌ స్లాబ్‌ తో చివరిదశ పనులు ముగించారు. వారం తరువాత వంతెన వారధిపై ఆటోలు, ఎడ్ల బండ్లు, ద్విచక్రవాహనాలకు మాత్రమే రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు లాలెప్ప, ఆనంద్‌, రైస్‌ మిల్‌ చంద్ర, మాబు సాబ్‌, బీటీ రమేష్‌, చాంద్‌ బాషా, జిలాన్‌, కురుబ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:368

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు