కార్మికుల సమస్యను పరిష్కరించండి 

On
కార్మికుల సమస్యను పరిష్కరించండి 

 మనస్సాక్షి, కణేకల్లు : తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ ఫణి కుమార్ కు వినతిపత్రం అందించారు. గత నెల 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు సమ్మె నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వీ ఐఏఎస్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో కార్మికులకు ఇవ్వాల్సిన 8 నెలల జీతభత్యాలను ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమింప చేశారు. కానీ ఇప్పటి వరకు జీతభత్యాలు రాకపోవడంతో గత నెల 29 నుండి తాగునీటి కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికుల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు కే. జై చంద్రారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి కోరి నాగరాజు, కాకిడి శర్మాస్, వైటి.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:20

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు