మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

On
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

మనస్సాక్షి, బుక్కరాయసముద్రం : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని మండల ఎంపిపి దాసరి సునీత పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్మత్ దీదీ లతో ఇంట్రాక్షన్ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దాసరి సునీత మాట్లాడుతూ మహిళలు సంఘాల ద్వారా కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి మహిళ సంఘంలో చేరి కుటుంబాలను పోషించుకోవాలన్నారు. సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సునీత ఐకెపి ఏపిఎం మద్దిలేటి.మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:15

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు