స్కానింగ్‌ సెంటర్లపై నిఘా ఉంచండి

On
స్కానింగ్‌ సెంటర్లపై నిఘా ఉంచండి

మనస్సాక్షి, అనంతపురం : జిల్లాలో లింగ నిష్పత్తి పెంచేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లలు

మనస్సాక్షి, అనంతపురం : జిల్లాలో లింగ నిష్పత్తి పెంచేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లలు ఎవరికీ ఎందులోనూ తక్కువ కాదు అని చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఆడపిల్లల విద్య, ఆరోగ్యం, నైపుణ్య పెంపుదల కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో లింగ నిర్ధారణ నివారణ చట్టంపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ లింగ నిష్పత్తి ఆందోళనకర స్థితిలో ఉన్న మండలాల్లో స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెంచాలన్నారు. ఎప్పటికప్పుడు డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. గర్భ నిరోధక మాత్రలు వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా అమ్మడం నేరమని మందుల షాపుల నిర్వాహకులకు స్పష్టం చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి తమకు నిర్దేశించిన డెకాయ్‌ అపరేషన్ల లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ డీఎంహెచ్‌ఓ డా.యుగంధర్‌, లింగ నిర్ధారణ నివారణ కార్యక్రమం అధికారులు డా. సుజాత, డా. చెన్న కేశవులు,డా.అనుపమా జేమ్స్‌,డా.నారాయణ స్వామి,డెమో భారతి,డిప్యూటీ డెమో త్యాగరాజు, డా.శ్రీనివాస్‌, డా.సురేష్‌, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:12

About The Author

Related Posts

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?