తొలి టీ-20లో నమీబియా సంచలనం
మనస్సాక్షి డెస్క్ : ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ-20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో నమీబియా జట్టు సంచలనం నమోదు చేసింది. శ్రీలంకను చిత్తు చేసింది.
మనస్సాక్షి డెస్క్ : ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ-20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో నమీబియా జట్టు సంచలనం నమోదు చేసింది. శ్రీలంకను చిత్తు చేసింది. 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకున్నది. నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్ 44 పరుగులు, స్మిత్ 31 పరుగులు చేశారు. ఈటన్, బార్డ్, కెప్టెన్ ఇరాస్మస్ రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 పరుగులకే కుశాల్ మెండిస్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. షికోంగో వేసిన నాలుగో ఓవర్‌లో నిస్సాంక, గుణతిలక వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఆ తర్వాత ఏ దశలోనే కోలుకోలేదు. 88 పరుగులకు 7 వికెట్లు చేజార్చుకుంది. రాజపక్స, షణక, ధనంజయ డిసిల్వ, తీక్షణ మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 19 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఘోరంగా ఓడిరది. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్, షికోంగో, వైస్, బెర్నార్డ్ రెండు వికెట్లు చొప్పున తీసుకున్నారు.