నాలుగు జిల్లాల అధికారులతో డీఐజీ రవిప్రకాష్ సమీక్ష
మనస్సాక్షి, అనంతపురం : అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు ఎన్‌డీపీఎస్, డ్రగ్స్ కేసులపై సమీక్ష చేశారు ఈ కేసుల్లో తయారీ, సరఫరా, విక్రయం మరియు కొనుగోలు వరకు సంబంధమున్న అందరిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘ఎన్‌డీపీఎస్ కేసుల్లో పలు రకాల నిందితులు ఉంటారు. (అఫెండర్స్, పెడ్లర్స్, కంజ్యూమర్స్ ) ఇందులో కీలక నిందితులు ఎక్కడో ఉంటూ అమ్మేవారు, ఎక్కడో గంజాయి పండిరచి అమ్మేవారు, సరుకు రిసీవ్ చేసుకున్న వారు, ఎక్కడో ఉండి సరుకు బుక్ చేసుకునేవారు, ట్రాన్సుపోర్ట్ చేసిన వారితో పాటు లోకల్ పెడ్లర్స్ ( గంజాయి, తదితర మాదక ద్రవ్యాలు అక్రమంగా లోకల్ గా అమ్మేవారు) కూడా నిందితులుగా చేర్చాలి. కమర్షియల్ క్వాంటిటీ కేసుల్లో( 20 కిలోల కంటే ఎక్కువ మోతాదులో ఉన్న గంజాయి) లోకల్ పెడ్లర్స్ ను గుర్తించాలి. అదేవిధంగా వీరికున్న కీలక నిందితులను లింకు చేయాలి. గంజాయిని వినియోగించే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. తరుచూ... మూడు, అంతకంటే ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితులుగా ఉంటే అలాంటి వారిపై పి.డి యాక్టు పెట్టాలి. ముఖ్య పట్టణాలలో గంజాయి, తదితర మత్తు పదార్థాల అనర్థాలపై హోర్డింగ్స్ పెట్టాలి. కళాశాలలకు వెళ్లి మత్తు పదార్థాలు- అనర్థాలపై కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన చేయాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలపై నిఘా వేసి మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని సూచించాలి. ఎన్‌డీపీఎస్ కేసుల్లో బాగా పని చేసిన వారికి రివార్డులు అందజేస్తాం. చెక్ పోస్టులు, ప్రత్యేక దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలి’’ అని డీఐజీ రవిప్రకాష్ సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో రేంజ్ పరిధిలోని ఎస్పీలు డాక్టర్ ఫక్కీరప్ప, రాహుల్ దేవ్ సింగ్, రిషాంత్ రెడ్డి, రేంజ్ పరిధిలో నాలుగు జిల్లాల అదనపు ఎస్పీలు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల ఎస్డీపీఓలు, నాలుగు జిల్లాల డీసీఆర్బీ సి.ఐ లు, తిరుపతి, చిత్తూరు జిల్లాల సెబ్ అధికారులు పాల్గొన్నారు.