తొలి టీ-20లో నమీబియా సంచలనం

On
తొలి టీ-20లో నమీబియా సంచలనం

మనస్సాక్షి డెస్క్‌ : ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ-20 ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లో నమీబియా జట్టు సంచలనం నమోదు చేసింది. శ్రీలంకను చిత్తు చేసింది.

మనస్సాక్షి డెస్క్‌ : ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ-20 ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లో నమీబియా జట్టు సంచలనం నమోదు చేసింది. శ్రీలంకను చిత్తు చేసింది. 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్‌ ఫ్రైలింక్‌ 44 పరుగులు, స్మిత్‌ 31 పరుగులు చేశారు. ఈటన్‌, బార్డ్‌, కెప్టెన్‌ ఇరాస్మస్‌ రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 పరుగులకే కుశాల్‌ మెండిస్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. షికోంగో వేసిన నాలుగో ఓవర్‌లో నిస్సాంక, గుణతిలక వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఆ తర్వాత ఏ దశలోనే కోలుకోలేదు. 88 పరుగులకు 7 వికెట్లు చేజార్చుకుంది. రాజపక్స, షణక, ధనంజయ డిసిల్వ, తీక్షణ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 19 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఘోరంగా ఓడిరది. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్‌, షికోంగో, వైస్‌, బెర్నార్డ్‌ రెండు వికెట్లు చొప్పున తీసుకున్నారు.

Manassakshi Epaper
Views:32

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు