‘జగన్‌ పాలనలో సాగునీటి కాల్వలు నిర్వీర్యం’

On
‘జగన్‌ పాలనలో సాగునీటి కాల్వలు నిర్వీర్యం’

మనస్సాక్షి , అనంతపురం :  అనంత కరువు రైతులకు అన్నం పెడుతున్న హెచ్‌.ఎల్‌. సి కాల్వలు జగన్‌ పాలనలో శిథిలావస్థకు చేరుకున్నా యని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హెచ్‌ఎల్సి కాల్వలను జనసేన నాయకులతో కలిసి సందర్శించారు.సాగు నీరు పారే కాల్వలు శిధిలావస్థలో వుండటం చూసి అవేదన వ్యక్తం చేశారు.హెచ్‌ఎల్సి కాల్వల్ని ఆధునీకరణ చేయలేని అసమర్థ సీఎంగా జగన్‌ రెడ్డి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని మండిపడ్డారు.10లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఘనుడు రైతన్నల సంక్షేమం కోసం హెచ్‌ఎల్సి కాల్వలను అభివృద్ధి చేయకుండా,ప్రతిపక్ష పార్టీల నాయకులు పై దూషణలు చేసే దౌర్భాగ్యపు సీఎం జగన్‌ అని ఆరోపించారు.అప్పర్‌ భద్ర జలాశయం ఎగువ రాష్ట్రం నిర్మిస్తున్న నోరుమెదపక, స్వప్రయోజనాల కోసం సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు.రైతులతో కలిసి పోరాటాలకు జనసెన పార్టీ సిద్దం ఔతోందని హెచ్చరించారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య,అవుకు విజయ్‌ కుమార్‌, ముప్పూరి కృష్ణ,జెక్కిరెడ్డి ఆదినారాయణ,హరీష్‌ రాయల్‌, రామంజి,పవనిజం రాజు,వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: janaseana
Manassakshi Epaper
Views:25

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు