ఏపీ ఎన్నికలపై ఆరా మస్తాన్‌ సర్వే

On
ఏపీ ఎన్నికలపై ఆరా మస్తాన్‌ సర్వే

  • 94 నుంచి 104 స్థానాల్లో వైసీపీ విజయం
  • 71 నుంచి 81 స్థానాల్లో కూటమి గెలుపు
  • కడపలో డిపాజిట్‌ కోల్పోనున్న వైఎస్‌ షర్మిల


మనస్సాక్షి డెస్క్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన ఆరా మస్తాన్‌ ఏర్పాటు చేసిన ‘ఆరా పోల్‌ స్ట్రాటజీస్‌’ తన ఫలితాలు విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించడంలో ఈ సంస్థకు మంచి  పేరుంది. క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌ వర్క్‌ ఉన్న ఆరా మస్తాన్‌.. గ్రౌండ్‌ లెవిల్లో.. ప్రతి విషయాన్నీ అంచనా వేయడంలో ముందుంటారు. ఏ పార్టీ గెలుస్తుందనే విషయంతో పాటు నాయకుల గెలుపును కూడా అంచనా వేయడంలో ‘ఆరా’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్‌ వెల్లడిరచారు. 49.61 శాతం ఓట్లతో 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు వివరించారు. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 47.55 శాతం ఓట్లతో 71 నుంచి 81 స్థానాలకు పరిమితం కానున్నట్లు స్పష్టం చేశారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 3.04 శాతం ఓట్లు సాధించనున్నట్లు ప్రకటించారు. 

ఇక పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి 25 ఎంపీలకు గాను 13 నుంచి 17 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించారు. ఎంపీ స్థానాల్లో 48.29 శాతం ఓట్లు వైసీపీ సాధించనుంది. ఇక ఎన్డీఏ కూటమి 47.68 శాతం ఓట్లతో 10 నుంచి 12 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా 4.03 శాతం ఓట్లు కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, స్వతంత్రులకు పడినట్లు స్పష్టం చేశారు. ఏపీలోని పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 3 శాతం ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ మూడు ఎంపీ స్థానాలు కోల్పోనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి ఓటు వేసిన ఓటర్లు.. ఎంపీ విషయంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల వైసీపీకి పార్లమెంట్‌ స్థానాల్లో నష్టం జరగనున్నట్లు వెల్లడిరచారు. ఇక కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్‌ షర్మిలకు డిపాజిట్‌ కూడా దక్కదని ఆరా మస్తాన్‌ వెల్లడిరచారు. ఇదిలావుండగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్‌ సర్వే చేసి ఎగ్జిట్‌ పోల్‌ విడుదల చేశారు. ఇందులో వైసీపీకి 119 నుంచి 126 అసెంబ్లీ స్థానాలు.. టీడీపీకి 47 నుంచి 56 స్థానాలు వస్తాయని అంచనా  వేయగా.. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితం అయ్యింది. 

Manassakshi Epaper
Views:733

About The Author

Related Posts

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?