23 నుండి ఇంజనీరింగ్‌ ప్రవేశాల తుది విడత ప్రక్రియ

On
23 నుండి ఇంజనీరింగ్‌ ప్రవేశాల తుది విడత ప్రక్రియ

మనస్సాక్షి డెస్క్‌ : ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్‌ 2024 తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ జులై 23 ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ  సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి నవ్య తెలిపారు. ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు జులై 23 నుండి జులై 25 లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 23 నుండి 26 వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని, జూలై 24 నుండి 26 వరకు 3 రోజుల పాటు ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్‌ స్పష్టం చేసారు. ఐచ్చికాల మార్పుకు 27వ  తేదీ నిర్దేశించామన్నారు. 30వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్‌ జాయినింగ్‌, కళాశాలలో రిపోర్టింగ్‌ కోసం  జూలై 31 నుండి ఆగస్టు 3 వరకు నాలుగు పాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అయ్యాయని డాక్టర్‌ నవ్య వివరించారు.

Manassakshi Epaper
Views:77

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?