అనంత నుంచి సొంత జిల్లాలకు 35 మంది తహశీల్దార్లు

On
అనంత నుంచి సొంత జిల్లాలకు 35 మంది తహశీల్దార్లు

మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాకు బదిలీ అయిన తహశీల్దార్లు ఎట్టకేలకు మళ్లీ తమ సొంత జిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో సొంత జిల్లాల్లో ఉన్న వారిని, ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, వైఎస్‌ఆర్‌ కడప, కర్నూలు జిల్లాల నుంచి 35 మంది తహశీల్దార్లు అనంతపురం జిల్లాకు బదిలీపై వచ్చారు. వీరిలో కొందరిని మండలాలకు.. మరికొందరిని కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాలకు నియమించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియంతో తహశీల్దార్లను వారు గతంలో పని చేస్తున్న జిల్లాలకు బదిలీ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 35 మంది తహశీల్దార్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బదిలీ అయిన తహశీల్దార్లు (మండలాల్లో పని చేస్తున్న వారు) తమ కార్యాలయాల్లో ఉన్న డిప్యూటీ తహశీల్దార్ల (రెగ్యులర్‌)కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెగ్యులర్‌ డిప్యూటీ తహశీల్దార్లు లేని ప్రాంతాల్లో సీనియర్‌ డీటీకి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది.  అదేవిధంగా అనంతపురం ఆర్డీఓ కార్యా లయంలో పని చేస్తూ బదిలీ అయిన తహశీల్దార్‌.. అదే కార్యా లయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న కె.పద్మావతికి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే కలెక్టరేట్‌లోని ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లో సూపరింటెండెంట్‌ పని చేస్తున్న తహశీల్దార్‌ను కలెక్టరేట్‌లోని సర్వీసెస్‌`1 డిటీగా ఉన్న ఆంజనేయులుకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. ఇక కో ఆర్డినేషన్‌ సెక్షన్‌లో పని చేస్తూ బదిలీ అయిన తహశీల్దార్‌.. కలెక్టరేట్‌ డీ`1 అసిస్టెంట్‌ బాషాకు తన బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా అనంతపురం జిల్లా నుంచి బదిలీ అయిన తహశీల్దార్లందరూ శనివారమే రిలీవ్‌ కానున్నారు. 

WhatsApp Image 2024-07-27 at 12.24.16 AM

Read More లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ

Manassakshi Epaper
Views:538

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?