ఉమ్మడి అనంతలో 223 ప్రైవేట్‌ మద్యం షాపులు

On
ఉమ్మడి అనంతలో 223 ప్రైవేట్‌ మద్యం షాపులు

  • గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన అధికారులు
  • నాన్‌ రీఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 2 లక్షలు
  • ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 11వ తేదీన అనంతపురం, పుట్టపర్తిలో లక్కీ డ్రా  
  • వైసీపీ హయాంలో 192 ప్రభుత్వ మద్యం షాపులు 
  • తాజాగా 31 దుకాణాలను పెంచిన ప్రభుత్వం

మనస్సాక్షి ప్రతినిధి, అనంతపురం : మందుబాబులకు కిక్‌ ఎక్కించేందుకు చంద్ర బాబు సర్కార్‌ సిద్ధమైంది. ప్రైవేట్‌ మద్యం టెండర్ల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.  ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 192 మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నిర్వహించింది. తాజాగా కూటమి ప్రభుత్వం మరో 31 దుకాణాలను పెంచింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 223 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం అనంతపురం జిల్లాలో 136, శ్రీ సత్యసాయి జిల్లాలో 87 మద్యం షాపులు రానున్నాయి. ఇందుకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను అనంత పురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు రామ్మోహన్‌రెడ్డి, గోవింద నాయక్‌లు వేర్వేరుగా మంగళవారం విడుదల చేశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి అత్యధికంగా అనంత పురం కార్పొరేషన్‌ పరిధిలో 30 దుకాణాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి ధర్మవరం మునిసిపాలిటీ పరిధిలో 10 షాపులు ఉన్నాయి. 

రూ.2 లక్షలు నాన్‌ రీఫండబుల్‌

మద్యం టెండర్లకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య వెల్లడిరచారు. షాపుల లైసెన్సు కోసం లాటరీ పద్ధతి చేపట్టనున్న నేపథ్యంలో రూ.2 లక్షల నాన్‌ రిఫండబల్‌ రిజస్ట్రేషన్‌ ఫీజుతో దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఆన్‌లైన్‌, హై బ్రిడ్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించ నున్నారు. ఏ జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తు చేస్తారో ఆ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి పేరు మీద రూ.2 లక్షల డీడీ తీయాల్సి ఉంటుంది. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 11వ తేదీన అనంతపురం జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాలకు అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్‌ హాల్‌లో లాటరీ తీయనున్నారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌లో 1/6 వంతు చెల్లించి మద్యం దుకాణాలను అక్టోబర్‌ 12వ తేదీ నుంచి ప్రారంభించవచ్చు. జనాభా ప్రాతిపదికన వైన్‌షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పదివేలు జనాభా ఉన్న చోట రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలు ఉన్న చోట రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షలు జనాభా వరకు రూ.65 లక్షలు, 5 లక్షలకుపైన ఉన్నచోట రూ.85 లక్షలు లైసెన్స్‌ ఫీజుగా నిర్ణయించారు. రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ శ్లాబ్‌కు సంబంధించి  ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని దుకాణాలు రూ.55 లక్షలు, రూ.65 లక్షలుగా నిర్ణయించారు. టెండర్‌ దక్కించుకున్న వారు మద్యం దుకాణాలను రెండేళ్ల కాల వ్యవధి వరకు నిర్వహించుకోవచ్చు. 

మండల స్థాయిలో 133 దుకాణాలు 

మద్యం షాపులకు సంబంధించి మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, నగర పంచా యతీ, మండల స్థాయిగా యూనిట్లు విభజించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మండల స్థాయిలోనే అత్యధికంగా 133 ప్రైవేట్‌ మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానున్న  136 షాపుల్లో  కార్పొరేషన్‌ పరిధిలో 30, మునిసిపాలిటీల పరిధిలో 32, మండల స్థాయిలో 74 దుకాణాలు రానున్నాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి మొత్తంగా 87 దుకాణాలు ఏర్పాటు కానుండగా మునిసిపాలిటీల పరిధిలో 22, నగర పంచాయతీ పరిధిలో 6, మండల స్థాయిలో 59 దుకాణాలు రానున్నాయి. 

అప్లికేషన్‌ ఎక్కడ ఇవ్వాలి?

అనంతపురం జిల్లాకు సంబంధించి టెండర్‌ దారులు అనంతపురం, బుక్కరాయసముద్రం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కంబదూరులో ఉన్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లలో దరఖాస్తులు అందజేయవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి, ధర్మవరం, సీకే పల్లి, పెనుకొండ, హిందూపురం, కదిరి, మడకశిర, తనకల్లులోని  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లలో అప్లికేషన్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.

clip-641

clip-642

Manassakshi Epaper
Views:68

About The Author

Related Posts

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?