అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు

On
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు

మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  అనంతపురం జిల్లాలో ప్రైవేట్‌ మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్‌ లాటరీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారంతా రానున్న నేపథ్యంలో జేఎన్‌టీయూ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చేపట్టామన్నారు. లాటరీ ప్రక్రియ సజావుగా సాగడం కోసం నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది 275 మందిని ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జేఎన్‌టీయూ ఆడిటోరియంకు చేరుకునే ప్రాంతంలో మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

Manassakshi Epaper
Views:332

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?