రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

On
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు - ఉరవకొండ ప్రధాన రోడ్డులో వేదావతి నదిపై రూ.48 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కణేకల్లు - మాల్యంకు సరైన రహదారి లేక కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీ.సీ. జనార్దన్ రెడ్డి సహకారాలతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఎన్ డీ బీ కింద ప్రభుత్వం రూ.48 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి నిర్మాణం కాలేదన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సంవత్సరం ఏ పనులు అడగలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రజా అవసరాల దృష్ట్యా ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆశీస్సులతో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీ.సీ.జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సహాయ సహకారాలతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. గత ఎన్నికల హామీ ప్రకారం  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.

WhatsApp Image 2024-10-13 at 9.56.14 PM

దసరా రోజున నా పుట్టిన రోజు కావడంతో అదే రోజు శంకుస్థాపన చేయాలనేదే నా సంకల్పం. ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ అధిగమించి శంకుస్థాపన చేస్తానని చెప్పాను. మాట ఇచ్చిన ప్రకారం దసరా రోజు శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దీర్ఘకాలంగా ఉన్న ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు. అలాగే కణేకల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన హామీని కూడా త్వరలో నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని సభాముఖంగా చెప్పారు.

WhatsApp Image 2024-10-13 at 9.58.07 PM

అనంతరం కూటమి టీడీపీ నాయకులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పలురు నాయకులు తెచ్చిన బర్తడే కేక్ లను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కట్ చేశారు. కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ లు రామ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, జనసేన పార్టీ రాయదుర్గం ఇన్చార్జ్ మంజునాథ్ గౌడ్, మండల కన్వీనర్ లాలెప్ప, రైస్ మిల్ ఆనంద్, ఆది, గోపులాపురం బసవరాజ్, వేలూరు మరియప్ప, కలేకుర్తి సుదర్శన్, ఎన్. హనుమాపురం సర్పంచ్ జయరాంచౌదరి, ఎంపీటీసీ నరేంద్రబాబు, షేక్ ముజ్జు, చంద్ర, చాంద్ భాషా, నవీన్, శరబన గౌడ్, చిన్న ఫక్రుద్దీన్, ఎంపీపీ లీలావతి, జెడ్పిటిసి డి. పద్మావతి, ఆర్ అండ్ బీ అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Image 2024-10-13 at 9.55.14 PM

WhatsApp Image 2024-10-13 at 9.57.13 PM

Manassakshi Epaper
Views:191

Latest News

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ...
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు
ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
బాబూ.. సంపద సృష్టి ఇదేనా?