లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
మనస్సాక్షి, చిలమత్తూరు : మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సమస్త భారతావనికి ఆరాద్యుడని తెలిపారు. ఏ నామం చేత భారత దేశం మేల్కొంటుందో, ఏ నామం హిందూ సమైక్యతను చాటుతున్నాదో ఆ ‘‘రామ నామాన్ని’’ యావత్తు ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. ఆ మహనీయుడి విగ్రహం ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఆయనకు నిత్య పూజలు అందుతాయని, ఆ ప్రాంతం ఆ గ్రామం సిరి సంపదలతో వర్దిల్లుతుందని అన్నారు. వాల్మీకి మహర్షి యావత్తు హిందూ సమాజం పూజించగలిగిన మహనీయుడని అన్నారు. ప్రభుత్వం కూడా వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించిందని గుర్తు చేశారు. వాల్మీకుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పాటు పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీడిపి నాయకులు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురెంద్రబాబు, బాలాజి, అంజినప్ప, రంగారెడ్డి, గంగాధర్, వాల్మీకులు నాగేంద్ర, నరేంద్ర, ప్రవీణ్ కుమార్, చరణ్, సూరి మరసనపల్లి అంజి, శీన, నాగరాజు, ముద్దన్న, గంగాధర తదితరులు పాల్గొన్నారు.